హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తేవాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం సెక్రటేరియట్లో ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, ట్రిబ్యునల్‌లో వాదనలు, ప్రాజెక్టు పనుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. పోలవరం నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏవిధంగా ముందుకు పోవాలనేదానిపై మంతనాలు సాగించారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రాజెక్టులన్నింటికీ సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకురావాలని సూచించారు. రెండునెలల్లో తమ్మిడిహట్టి డీపీఆర్‌ను తయారు చేయాలని దిశానిర్దేశం చేశారు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.