హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : యాసంగిలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ధాన్యం కొనుగోళ్లపై సచివాలయంలో ఏర్పా టు చేసిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 8,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటి వరకు 5,000 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు 4 లక్ష ల 89వేల మెట్రిక్ ట న్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. పొరుగు రా ష్ర్టాల నుంచి అక్రమంగా ధాన్యం తరలిరాకుండా అంతరాష్ట్ర చెక్ పోస్టుల నిఘాను తీవ్రతరం చేస్తున్నామని పేర్కొన్నారు. ధాన్యానికి చెల్లింపులు ఎప్పటికప్పుడు జరిగేలా పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): పంటల కొనుగోలు భారాన్ని రాష్ర్టాలపై మోపొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర(ఎంఎస్పీ) ప్రకటించి, పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం తీరుతో రాష్ట్రం పై భారీగా ఆర్థిక భారం పడుతుందని తెలిపారు. మద్దతు ధర ప్రకటించిన ప్రతి పంట నూ కేంద్రమే కొనుగోలు చేయాలని డి మాండ్ చేశారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులతోపాటు వర్సిటీ శాస్త్రవేత్తలు, అధికారులతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. వానకాలం కోసం డిమాండ్ గల విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉం చాలని అధికారులను ఆదేశించారు.