హైదరాబాద్,జనవరి 21(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ప్రాజెక్టుల వారీగా ప నుల పురోగతిని సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల కొనసాగింపునకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పా టు చేస్తున్నామని చెప్పారు. టన్నెల్ బో రింగ్ మెషిన్(టీబీఎం) శకలాలను పూర్తిగా తొలగించామని, ప్రస్తుతం రైలు ట్రాక్ మరమ్మతులు కొనసాగుతున్నాయని తెలిపారు.
తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి డీపీఆర్ తయారీ తుది దశకు చేరుకున్నదని వె ల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల తనిఖీ నివేదికలు, పునరుద్ధరణ ప్రణాళికలను పుణె సెంట్రల్ వాటర్ ప వర్ రీసెర్చ్ స్టేషన్ సమర్పించిందని తెలిపా రు. ముగ్గురు సభ్యుల బృందం అధ్యయ నం ప్రారంభించిందని తెలిపారు. డిజైన్లు నెలలో రూపొందించాలని చెప్పారు. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను సాధించేందుకు కృషిచేయాలని సూచించారు. శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.