వరంగల్/ఖమ్మం అర్బన్ / కరీంనగర్ కమాన్‌చౌరస్తా/ కామారెడ్డి, ఆగస్టు 5 : తమ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఆయా జిల్లా కేంద్రాల్లో ధర్నా చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు, డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిషరించకుంటే ఈ నెల 24న హైదరాబాద్ ఇందిరాపార్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిషన్‌రావు మాట్లాడుతూ నూతన జిల్లాలకు డీఈవో పోస్టులను, మండలాలకు ఎంఈవో పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదు ట యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అనిల్‌కుమార్ మాట్లాడారు. పీఆర్పీ ప్రకటించి రెండేండ్లవుతున్నా అమలుచేయకపోవడంపై మండిపడ్డారు.
ఖమ్మం కలెక్టరేట్ ధర్నాచౌక్ ప్రాంగణం వద్ద యూఎస్పీసీ రాష్ట్ర నాయకురాలు చావా దుర్గాభవాని మాట్లాడా రు. బీఈడీ అర్హత కలిగిన వారికి కూడా ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టరేట్ల వద్ద టీచర్లు ధర్నాచేశారు. 23న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.