హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రానున్న రబీ సీజన్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ప్రతి నెలకు 2 లక్షలకు తగ్గకుండా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి తుమ్మల రబీ సీజన్ ఎరువుల సన్నద్ధతపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టానికి సెప్టెంబర్‌లో వచ్చిన 1.84 లక్షల టన్నుల యూరియా వల్లే రైతులకు ఊరట కలిగిందని పేర్కొన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకంలో 20 ఏండ్లుగా పనిచేస్తున్న తమకు పే సేల్ వర్తింపజేయాలని ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్(ఎఫ్టీఈఎస్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి సీతకతో సమావేశమై సమస్యలు విన్నవించారు. స్పందించిన మంత్రి సీతక.. పే సేల్కు సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.