e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home తెలంగాణ ఉపాధి కూలీ ఎంతిస్తుండ్రమ్మా.. మంత్రి ఎర్రబెల్లి ఆప్యాయ పలకరింపు

ఉపాధి కూలీ ఎంతిస్తుండ్రమ్మా.. మంత్రి ఎర్రబెల్లి ఆప్యాయ పలకరింపు

మునుగోడు: రోజుకు ఉపాధి కూలీ ఎంతిస్తుండ్రమ్మా.. అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉపాధిహమీ కూలీల ను ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం మునుగోడు మీదుగా వెళ్తూ కాన్వాయ్ ఆపిన మంత్రి ఉపాధి కూలీలతో మాట్లాడారు. రోజు వారీ కూలీ ఎంతిస్తున్నార ని మంత్రి ప్రశ్నించగా.. రూ.250 ఇస్తుండ్రు సార్ అని వారు బదులిచ్చారు.


అనంతరం పంచాయతీ సిబ్బందితో మాట్లాడి మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆరా తీశారు. ఈ సందర్భం గా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఎవెన్యూ ప్లాంటేషన్ కింద రోడ్లకు ఇరువైపులా 6,437 కిలోమీటర్ల పొడవున మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఇప్పటికే 3,155 కిలోమీటర్ల పొడ వున మొక్కలు నాటినట్లు తెలిపారు.

- Advertisement -


హరితహారంలో భాగంగా ప్రస్తుత ఏడాది 8.76కోట్ల మొక్కలకు గానూ 7.91కోట్ల మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. మిగతా లక్ష్యాన్ని ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని తెలిపారు. మొక్కలకు ఎప్పటికప్పుడు నీరందించ డంతో పాటు జంతువుల నుంచి సంరక్షణకు ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని ఆదే శించారు. వంద శాతం మొక్కలను బతి కించేందుకు పంచాయతీ పాలకవర్గాలు, సిబ్బంది ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement