హైదరాబాద్, మే 3(నమస్తే తెలంగాణ): సాగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిసున్నట్టు యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. ఈ నెల 5నుంచి కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 13వరకు రాష్ట్రంలోని సుమారు 1200 రెవెన్యూ గ్రామాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 12గంటల వరకు శాస్త్రవేత్తల బృందం రైతులతో సమావేశమవుతుందని చెప్పారు. యూరియా వాడకాన్ని తగ్గించడం, అవసరం మేరకే రసాయనాల వినియోగంపై అవగాహన కల్పించనున్నట్టు ఆయన వివరించారు.