హైదరాబాద్, డిసెంబర్13 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కాకుండా, విచక్షణా అధికారాలను ఉపయోగించి ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఏకసభ్య కమిషన్‌కు కుల నిర్మూలన వేదిక, తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం నేతలు విజ్ఞప్తి చేశారు.
బీఆర్కే భవన్‌లోని ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్‌ను శుక్రవారం ఆ యా సంఘాల నేతలు ప్రత్యేకంగా కలిశారు. 2011తోపాటు 2014 సమగ్ర కుటుంబ సర్వే లెకలు, ఇటీవల నిర్వహించిన కులగణన వివరాలను పరిగణలోకి తీసుకుని ఎస్సీ వర్గాల రిజర్వేషన్ కోటాలను నిర్ణయించాలని కోరారు.