అంబర్‌పేట, నవంబర్ 17 : ఇండ్లు కూ ల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర ప్ర భుత్వం పేదలపై యుద్ధం ప్రకటించి ఇండ్లు కూల్చుతున్నదని ఆరోపించారు. అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ తులసీరాంనగర్ లంక బస్తీలో ‘మూసీ నిద్ర’లో భాగం గా కిషన్‌రెడ్డి శనివా రం రాత్రి శంకరమ్మ ఇంట్లో నిద్ర చేశారు. ఆదివారం ఉదయం అల్పాహారం కూడా అక్కడే చేశారు.
అనంతరం బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతంరావు, మాజీ కార్పొరేటర్ వనం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పేదల ఇండ్లపై బు ల్డోజర్లు ఎక్కిస్తాం.. అడ్డమొచ్చినవారిని తొ క్కిస్తాం.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇండ్లు కూలగొట్టేది రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమా? కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసమా? అనేది ప్రభుత్వం స్పష్టంచేయాలన్నారు.