హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతుగా మారిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే నగదు పంపుతున్నారని, ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ మాత్రం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అనేక విమానాశ్రయాలు ఉన్నాయని, తెలంగాణలో ఎందుకు లేవని రేవంత్ సర్కార్ను నిలదీశారు.