సిటిబ్యూరో (నమస్తే తెలంగాణ), ఆగస్టు 8 : చందానగర్ లోని జీఎస్ ఎం మాల్ ఎదుట సర్వీస్ రోడ్డుపై శనివారం సాయంత్రం బెలూన్లు నింపేందుకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ఒకసారిగా పేలడంతో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బెలూన్లు అమ్ముకునే వ్యక్తి వినియోగించి గ్యాస్ సిలిండర్ శనివారం సాయంత్రం ఒకసారిగా పేలిపోయింది.
కాగా ఈ ప్రమాదంలో ఐస్క్రీం అమ్ముకునే వివేక్ పాల్ (19) తీవ్రంగా గాయపడగా, అతడి పరిస్థితి విషమంగా ఉంది. ముల్లగాని జనార్దన్, నంద్యాల ధనుష (16), అలాగే విన్నకోట సింధు ప్రియ (25), ఐటీ ఉద్యోగినులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.