Kishan Reddy | హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ‘ఖాటా ఖట్’ నుంచి ‘ఖాళీ ఖజానా’ వరకు, తెలంగాణలో కాంగ్రెస్ గందరగోళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇకపై దాచలేరని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. నకిలీ వాగ్దానాలు, హామీల అమలులో విఫలం కావడం, ఖజానా ఖాళీ చేయడం.. కాంగ్రెస్ పాలనా నమూనాకు తెలంగాణ ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాల వలయంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
From ‘Khata Khat’ to ‘Khaali Khazana’, CM Revanth Reddy can’t hide the Congress chaos in Telangana, anymore.
Telangana is a quintessential example of the Congress model of governance:
— Fake Promises
— Failed Delivery
— Emptying & Draining the treasuryAnd in the soup are the… pic.twitter.com/Kyc07FKOrd
— G Kishan Reddy (@kishanreddybjp) June 19, 2025