Minister Bandi Sanjay | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఒక పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా చేస్తామంటూ ‘పాంచ్ న్యాయ్ పత్’్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నిజంగా ‘పాంచ్ న్యాయ్ పత్’్రకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి, ఎన్నికల్లో పోటీ చేయించాలని సవాల్ విసిరారు. బీజేపీలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి చేరాల్సిందేనని స్పష్టం చేశారు. బండి సంజయ్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంల భేటీని స్వాగతించారు. అయితే చిత్తశుద్ధితో సమస్యల పరిషారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెసోళ్లకు ఉద్యోగాలు దొరికాయికానీ, నిరుద్యోగులకు మాత్రం ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా దొరకలేదని వ్యాఖ్యానించారు. ఏడు నెలల్లో ఒక ఉద్యోగమివ్వని కాంగ్రెస్ సరార్ మిగతా ఐదు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి ఫిరాయింపులపై దృష్టి పెట్టడం అన్యాయమని మండిపడ్డారు.
కాంగ్రెస్‌లోకి వస్తారని చెప్తున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించే దమ్ముందా అని సవాల్ విసిరారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో కాం గ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదని, నిధుల పంపిణీ బాధ్యత అకడ ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు అప్పగించడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే పరిస్థితి ఎట్లుంటదో ఆలోచించాలని అన్నారు. రాజకీయాలకు, పార్టీలకతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, నిధుల కేటాయించాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించిన బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం నేతలు దాడి చేయడం హేయమైన చర్యని ఖండించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలకడం ఎంఐఎం నేతలకు అలవాటైందని, అందుకే రైవంత్రెడ్డితో ఒవైసీ కుమకై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం ఒక ప్రాంతానికే పరిమితమైన పార్టీ అని, బీజేపీ తలుచుకుంటే ఎంఐఎం నేతలు బయట తిరగలేరని, తనకు మంత్రి పదవిచ్చి చేతులు కట్టేశారని (నవ్వుతూ…) సంజయ్ వ్యాఖ్యానించారు.