హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రైతుల శ్రేయస్సును విస్మరించిన 2024-25 బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న జిల్లా, మండల కేంద్రాల్లో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్లు సాగర్, పద్మ మాట్లాడుతూ.. ఆహార సబ్సిడీ, వడ్డీ మాఫీ, వ్యవసాయ పరిశోధనలకు సరిపడా నిధులు పెంచలేదని ఆరోపించారు.