కరీంనగర్ : సీఎం కేసీఆర్(CM KCR)ను రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP) ఈడీ దాడులు చేయిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్(Mla Ravishanker) విమర్శించారు. శుక్రవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లిక్కర్ స్కాం పేరుతో ఎమ్మెల్సీ కవితపై ఈడీ(ED) చేస్తున్న దాడులు ప్రధాని నరేంద్ర మోదీ(Narendhra Modi) చేయిస్తున్న దాడులేనని మండి పడ్డారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్(BRS)ను జాతీయ స్థాయిలో ప్రారంభించగానే కేంద్రం అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ దాడుల(ED Raids) పేరుతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఆమ్ఆద్మీ పార్టీ(AAP) నాయకులతో కవితక్కకు కేవలం రాజకీయ సంబంధాలు తప్ప మరేలాంటి సంబంధాలు లేవని వెల్లడించారు. చట్టపరంగా తనను ఇంట్లో విచారించాలని కవిత కోరుతున్నా ఈడీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు.
కవితక్కను నిందితురాలిగా చూపించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవినీతిపరులు బీజేపీలో చేరితే ఎలాంటి కేసులు ఉండడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్న ఆదానీ(Aadani)పై ఎందుకు ఈడీ దాడులు చేయడం లేదని ప్రశ్నించారు. విజయ్ మాల్యా(Vijay Malya), నీరవ్‌మోదీ(Neerav Modi)లపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. మోదీ గతంలో చాయ్ అమ్ముకున్న విధంగా ఇప్పుడు దేశాన్ని అమ్ముతున్నారని ఆరోపించారు.
షాబోద్దీన్ కేసులు అమిత్‌షా సుప్రీంకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారని, ఎమ్మెల్యే కొనుగోలు కేసులోనూ బీఎల్ సంతోష్‌కు సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారని గుర్తు చేశారు. కవితక్క కూడ సుప్రీంకోర్టుకు వెళ్తే బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, చొప్పదండి నాయకులు సురేందర్ రెడ్డి, చొక్కారెడ్డి, నర్సింగరావు, రవీందర్, వీర్ల వెంకటేశ్వర్రావు, నాగరాజు, దూలం సంపత్ తదితరులు పాల్గొన్నారు.