హైదరాబాద్ : మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ( Students Died ) దుర్మరణం చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది . కారులో ప్రయాణిస్తున్న 8 మంది విద్యార్థులు అతివేగంగా వెళుతూ మెట్రో పిల్లర్ 97ను బలంగా ఢీకొట్టింది
ఈ ఘటనలో సాయి వరుణ్, నిఖిల్ అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోగా వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ అనే ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు వనపర్తి జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.