మానకొండూర్ రూరల్, డిసెంబర్ 28: గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థు లు కొట్టుకోగా ఓ విద్యార్థికి తీవ్ర గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా కేశవపట్నానికి చెందిన సుమలత-సంపత్ కొడుకు తనయ్ దేవంపల్లి గురుకులంలో పదో తరగతి చదువుతున్నాడు. ఓ విద్యార్థితో ఈ నెల 11న జరిగిన గొడవలో తనయ్ ముక్కుపై తీవ్రం గాయమైంది. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని తనయ్ను దవాఖానకు తరలించారు. శస్త్రచికిత్స తర్వాత 15న గురుకులానికి వెళ్లారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ స్పందించడంలేదని తన య్ తల్లిదండ్రులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇద్దరు విద్యార్థులు దాడి చేసుకున్న మాట నిజమేనని, ప్రస్తుతం వారిద్దరూ పాఠశాలకు దూరంగానే ఉన్నారని ఇన్చార్జి ప్రిన్సిపాల్ శివకుమార్ తెలిపారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా గోలి జగన్నాథం ఉన్న సమయంలో దాడి ఘటన జరిగిందని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.