మహబూబ్‌నగర్ విద్యావిభాగం, నవంబర్ 28 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకులం-3 నుంచి ఇద్దరు విద్యార్థులు పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ముస్తఫా, అహ్మద్ ఈనెల 26న రాత్రి కిటికీ నుంచి దూకి పారిపోయారు.
తెల్లవారుజామున విద్యార్థులు కనిపించడం లేదనే సమాచారంతో సీసీ కెమెరాలు పరిశీలించి.. తల్లిదండ్రులకు సమాచారమిచ్చి పోలీసులకు చెప్పలేదు. కాగా పారిపోయిన విద్యార్థులను గుంటూరు రైల్వేస్టేషన్లో చైల్డ్‌లైన్ సిబ్బంది, పోలీసులు గుర్తించారు. ముస్తఫా తల్లిని చూసేందుకు గురుకులం నుంచి బయటకు వచ్చినట్టు విద్యార్థులు తెలిపినట్టు సమాచారం.