బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 11:21:07

ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌

ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌: కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన పోలీసులు ఇప్పుడు అదే వైరస్‌ బారిన పడుతున్నారు. ఇలా మహమ్మారి బారినపడుతున్న పోలీసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్‌ లక్షణాలు కన్పించడంతో పరీక్షలు నిర్వహించగా హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు మరో కానిస్టేబుల్‌కు పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారికి అమీర్‌పేటలోని పకృతి వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. నిన్న నిర్వహించిన పరీక్షల్లో బంజారాహిల్స్‌ పీఎస్‌లోని 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.


logo