వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్ కల్వర్టును ఢీ కొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన దేశాయిపేట- పైడిపల్లి ప్రధాన రహదారి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.