సిద్దిపేట అర్బన్/పాపన్నపేట,ఆగస్టు 30: ఉమ్మడి మెదక్ జిల్లాలో డెంగ్యూతో ఇద్దరు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా తడ్కపల్లికి చెందిన సుతారి కనకలక్ష్మి(28)కి డెంగ్యూ వచ్చింది. సిద్దిపేట, హైదరాబాద్లోని పలు ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించారు. దాదాపు 25 లక్షలు ఖర్చుపెట్టినా ప్రయో జనం లేకుండా పోయింది. ఆరోగ్యం విషమించి గురువారం రాత్రి మృతిచెందారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చీకోడ్ గ్రామానికి చెందిన వడ్ల రాజు పెద్ద కొడుకు హర్షిత్ చారి (11) స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. వారం కిత్రం డెంగ్యూ బారినపడగా మెదక్, హైదరాబాద్లోని దవాఖానల్లో చికిత్స అందిం చారు. పరిస్థితి విషమించి గురువారం రాత్రి దవాఖానలో మరణించాడు.