హైదరాబాద్ : జనగామ జిల్లాలో(Janagama district) విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road accident) ఇద్దరు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ ఘన్పూర్లో స్కూటీనికి కారుడు ఢీకొనడంతో రమేష్(55) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ప్రమాదంలో స్టేషన్ ఘన్పూర్ మండలం చాగల్లు వద్ద జాతీయ రాహదారిపై కారు ఢీ కొని లచ్చమ(70) అనే వృద్ధురాలు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.