కామారెడ్డి జిల్లా దేమె గ్రామంలో ఘటన.. మూడు రోజులుగా వాంతులు, విరేచనాలతో గ్రామస్థులకు అస్వస్థతడయేరియా మరణాలతో రాష్ట్రంలో కలకలం
లింగంపేట(తాడ్వాయి), జూలై 23: డయేరియాతో ఇద్దరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమె గ్రామంలో చోటుచేసుకున్నది. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మూడు రోజులుగా గ్రామస్థులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొనింటి చిన్న భూమయ ్య(60) మంగళవారం మృతి చెందగా, మెట్టు స్వామి (30) బుధవారం ఉదయం మృత్యువాతపడ్డాడు.
మూడు రోజుల క్రితం గ్రామస్థులు వన భోజనాలకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ కలుషిత నీటిని తాగడం వల్ల తొమ్మిది మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వెంటనే దవాఖానలకు తరలించగా చిన్న భూమయ్య, మెట్టు స్వామి మరణించారు. మరో ముగ్గురు చికిత్స పొందుతుండగా నలుగురు డిశ్చార్జి అయ్యారు. డయేరియా వ్యాపించడంతో వైద్యాధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో 3 డెంగీ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని సంజీవయ్యనగర్, జవహార్‌నగర్, కృ ష్ణారెడ్డినగర్లో ఒక్కొక్కరు చొప్పున డెంగీతో బాధపడుతున్నారు. విష యం తెలుసుకొన్న జిల్లా ప్రోగ్రాం అధికారి భాస్కర్, పీహెచ్సీ వైద్యాధికారి మనుప్రియ ఆధ్వర్యంలో బుధవారం వైద్యసిబ్బంది ఆయా కాలనీలలో పర్యటించారు. లోఫీవర్ సర్వే, యాంటీ లార్వల్ ఆపరేషన్స్‌లో భాగంగా దోమల నివారణ మందు స్ప్రే చేయించారు. డెంగీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.