హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో అత్యధికంగా ములుగు జిల్లా తడ్వాయిలో 5.54 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు తెలిపింది.