హైదరాబాద్ : రెక్కాడితే గాని డొక్కాడని కూలీలపై ప్రకృతి కన్నెర్ర జేసింది. రోజువారి కూలీ పని చేసుకొని జీవించే బడుగులపై పిడుగుపడి వారి జీవితాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి(Lightning strike) ఇద్దరు కూలీలు మృతి (Laborers killed) చెందగా, మరో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా దమ్మపేట మండలం జగ్గారంలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన కూలీలు వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఇంతలోనే పిడుగు రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. పిడుగుపాటుకు గరై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒకేసారి ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | బాబు చిట్టి నాయుడు.. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేయలేరు.. రేవంత్‌కు కేటీఆర్ చురకలు
KTR | అనగనగా ఓ చిట్టి నాయుడు.. ఆయనకు ఏడుగురు అన్నదమ్ముళ్లు.. రేవంత్ కథ ఇదీ..!
KTR | రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే.. హైడ్రా బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలి : కేటీఆర్