చండ్రుగొండ/సంగెం, జూలై 19 : పలు జిల్లాల్లో శనివారం వర్షం కురవగా పిడుగుపాటుకు వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకట్యాతండాలో శనివారం సాయంత్రం రైతు బానోతు రవి (38) పత్తి చేనులో పనిచేస్తుండగా పిడుగుపడటంతో మృతిచెందాడు.
కాగా వరంగల్ జిల్లా ఎల్గూర్ రంగంపేటలో మత్య్సకార్మికుడు సుధాకర్(48) పిడుగుపడి చనిపోయాడు.