మెదక్ : మెదక్ జిల్లాలో(,Medak district) తీవ్ర విషాదం నెలకొంది. పిడుగు పడి(Lightning strike) ఇద్దరు వ్యక్తులు మృతి(Two killed) చెందారు. ఈ విషాదకర సంఘటన హవేలీ ఘనపూర్ మండలం శంనాపూర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. గ్రామానికి చెందిన శెట్టబోయిన సిద్దయ్య (50) చాకలి నందు (22) నిన్న సాయంత్రం కట్టెల కోసం అడవిలోకి వెళ్లారు.
రాత్రి అయినా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి అడవిలో వెతకగా మల్లన్న గుట్ట ప్రాంతంలో పిడుగు పడి వారిద్దరూ మృతి చెందినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఒకేసారి ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.