హైదరాబాద్ : విద్యుదాఘాతంతో(Electric shock) ఇద్దరు రైతులు మృతి(Farmers died) చెందారు. ఈ విషాదకర సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar) చిన్న చింత కుంట మండలం, పర్దీపూర్‌లో చోటు చూసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని ఓ జలాశయం వద్ద విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మోహన్‌రెడ్డి(62), మల్లప్ప(55) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.