అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
ఓ వైపు పంటలకు నీరందక.. పెట్టుబడులు చేతికి రాక.. మరోవైపు అప్పుల భారం పెరిగి ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన రైతు బొమ్మెర మహేందర్ (42) తనకున్న ఐదెకరాలతోపాటు మరో 15 ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు.
- పంటలకు నీరందక.. పెట్టుబడులు చేతికి రాక
- మానుకోట, నల్లగొండ జిల్లాల్లో ఇద్దరి బలవన్మరణం
తొర్రూరు/నార్కట్‌పల్లి, అక్టోబర్ 21 : ఓ వైపు పంటలకు నీరందక.. పెట్టుబడులు చేతికి రాక.. మరోవైపు అప్పుల భారం పెరిగి ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటనలు మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. బాధిత కుటుంబాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన రైతు బొమ్మెర మహేందర్ (42) తనకున్న ఐదెకరాలతోపాటు మరో 15 ఎకరాలను కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు.
పంటలకు సరిపడా నీరు అందకపోవడంతో బావి తవ్వించేందుకు సుమారు రూ.7 లక్షలు అప్పు చేశాడు. బోరులో నీటిమట్టం తగ్గిపోయింది. విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయం కారణంగా పంటలకు నీరు అందించలేకపోయాడు. వరి పంట నీరు లేక ఎకడికకడ బీటలు వారి ఎండిపోయింది. ఓవైపు బావి తవ్వకానికి చేసిన రూ.7 లక్షల అప్పు, మరోవైపు కౌలుకు తీసుకున్న 15 ఎకరాల్లో పంట పూర్తిగా ఎండిపోవడంతో చేతికి రూపాయి కూడా వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో దసరా పండుగ రోజు మహేందర్ పొలం వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆగా మోత్కూరులో కౌలు రైతు
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామానికి చెందిన కౌలు రైతు దొడ్డి సాగర్ (36) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగా మోత్కూరు శివారులో ఎకరం 30 గుంటల్లో పత్తి, మునుకుంట్ల శివారులో సుమారు 6 ఎకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశాడు. అదేవిధంగా మునుకుంట్ల శివారులో లీజు పద్ధతిలో కోళ్ల ఫారాన్ని నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం రూ.50 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు చెల్లించే పరిస్థితి లేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 18న గడ్డిమందు తాగి ఇంట్లో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సాగర్ భార్య దివ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

