Farmers Suicide | ఖమ్మం రూరల్ / తొగుట, మార్చి 27 : సాగునీరు అందక, పంటకు గిట్టుబాటు ధర లేక ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో అప్పుల బాధతో ఇద్దరు రై తులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లికి చెందిన గుమ్మడిదల వెంకటయ్య (47) వ్యవసాయం చేస్తూ కు టుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడాది క్రితం పెద్ద కూతురు నాగలక్ష్మి పెళ్లి చేశాడు. వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల భూమిలో యాసంగిలో వరి పంట వేశాడు. సాగునీరు రాక వరిపం ట పూర్తిగా ఎండిపోయింది. కూతురు పెళ్లికి, సాగుకు తెచ్చిన అప్పు అలాగే ఉండడంతోపాటు చిన్న కూతురు ఆశ్విత కూడా పెళ్లీడుకు వచ్చింది. ఈ క్రమంలో అప్పు రూ.5 లక్షలు ఎలా తీర్చాలోనని తీవ్ర మనస్తాపానికి గురై న వెంకటయ్య ఈ నెల 24న పురుగులమందు తాగాడు. సిద్దిపేట ఏరియా దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మం డలం మంగళగూడెం గ్రామానికి చెం దిన బోనగిరి ఉప్పలయ్య(43) తనకు న్న 1-20 గుంటల భూమితోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొ ని మిర్చి సాగు చేశాడు. చేతికొచ్చిన పంటను ఈ నెల 25న ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు తీసుకెళ్లి విక్రయించాడు. పంటకు ఆశించినమేర ధర లే కపోవడం.. సాగు కోసం చేసిన అప్పు లు తీర్చడానికి అవసరమైన డబ్బులు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. బుధవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి న ఉప్పలయ్య కౌలుకు తీసుకున్న భూమిలో వేపచెట్టుకు ఉరేసుకున్నా డు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప్పలయ్య భార్య ఉపేంద్ర, కుమారుడు మల్లేశ్, బంధువులు ఘ టనాస్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. భార్య ఫి ర్యాదు మేరకు రూరల్ పోలీసులు కే సు దర్యాప్తు చేస్తున్నారు.