మూసాపేట/రామన్నపేట, మార్చి 10: అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో యువరైతు, భువనగిరి జిల్లాలో కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం మహ్మద్హుస్సేన్పల్లికి చెందిన పూల మహేశ్(39) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన పొలంలో మొక్కజొన్న, వరి, పల్లి సాగు చేశాడు. దిగుబడి రాకపోవడంతో రూ.30 లక్షల వరకు అప్పులయ్యాయి. వడ్డీ, అసలు కట్టే మార్గం కనిపించక మనస్తాపంతో ఆదివారం పురుగుల మందు తాగా డు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. మహేశ్‌కు భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వేణు తెలిపారు.
యాదాధ్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన మోటె నర్సింహ(50) 14ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. పెట్టుబడి కోసం అప్పు చేశాడు. నీళ్లందక ఐదెకరాల పొలం ఎండిపోయింది. అప్పులు కట్ట లేనని ఐదురోజుల నుంచి మనస్తాపం చెందుతున్నాడు. సోమవారం ఉదయం పొలం వద్ద పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నా డు. 108లో రామన్నపేట ప్రభుత్వ ద వాఖానకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. నర్సింహకు భార్య, ఇద్దరు కూ తుర్లున్నారు. భార్య కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మల్లయ్య తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దకొత్తపల్లి, మార్చి 10 : పంటకు సాగునీరు పారించేందుకు వెళ్లిన రైతు కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది. రైతు బంధువులు, స్థానికుల కథనం మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం పాత యాపట్లకు చెందిన రైతు బక్కయ్యగౌడ్ (60)కు మూడున్నర ఎకరాల పొలం ఉన్నది. యాసంగిలో వేరుశనగ సాగు చేశాడు. పంటకు నీరందించేందుకు ఆదివారం సాయం త్రం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ బోరు మోటర్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్తు స్టార్టర్ వద్ద కట్ అయిన వైర్ తగిలి చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సతీశ్ తెలిపారు.