జగిత్యాల: జిల్లాలోని కోరుట్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మోహన్‌రావుపేట సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కోరుట్ల దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.