సత్తుపల్లి రూరల్, జనవరి 21: నీటికుంటలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన ఇస్రం వికాస్ (9), కోలా సిద్ధ్దార్థ (12) స్నేహితులు. స్థానిక పాఠశాలలో ఐదోతరగతి, ఏడోతరగతి చదువుతున్నా రు. ఆదివారం సెలవు కావడంతో మరో బాలుడితో కలిసి వీరు సమీపంలోని నీటికుంట వద్దకు వెళ్లారు.
అక్కడ బాతులను ఆడించేందుకు వికాస్, సిద్ధ్దార్థ నీటిలోకి దిగి గల్లంతయ్యారు. ఒడ్డున కూర్చున్న మరో బాలుడు గ్రామస్థులకు సమాచారమిచ్చాడు. గ్రామస్థుల సాయంతో తల్లిదండ్రులు వికాస్, సిద్ధ్దార్థ మృతదేహాలను బయటకు తీయించారు. సీఐ మోహన్‌బాబు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వీరిద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.