బోధన్, మే 15 : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో మంజీర నది తీరాన ఉన్న సిద్ధాపూర్, ఖండ్గావ్ ఇసుక క్వారీలను గురువారం అధికారులు మూసివేయించారు. నమస్తే తెలంగాణ మెయిన్ ఎడిషన్లో ‘మంజీరకు గర్భశోకం!’ పేరిట బుధవారం ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
సిద్ధాపూర్, ఖండ్గావ్ ఇసుక క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలు, రవాణాపై ప్రచురితమైన కథనంతో ఇసుక క్వారీలను బంద్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇసుక క్వారీలను తెరిచేందుకు మళ్లీ ఆదేశాలు వస్తే ఓపెన్ అవుతాయని బోధన్ తహసీల్దార్ విఠల్ తెలిపారు.