హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కొన్ని రాజకీయ పార్టీలు రైతులను రెచ్చగొట్టి, ఎరువుల దుకాణాల వద్ద ధర్నాలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఇకపై యూరియా కొరత లేకుండా చూస్తామని తెలిపారు. యూరియా పంపిణీ కోసం రైతులకు ముందుగానే టోకెన్లు జారీ చేయడం ద్వారా క్యూలు లేకుండా, తోపులాటలు జరగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా పంపిణీ సజావుగా జరుగుతున్నదని తెలిపారు. రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ మొదటి రోజు ఎలాంటి ఆందోళనలు లేకు ండా సజావుగా జరిగిందని, అదే పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.