అశ్వారావుపేట, మే 14: రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయకుండా రైతులను రాష్ట్ర ప్రభుత్వంపైకి ఎగదోస్తున్నదని విమర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఉద్యాన పరిశోధనా కేంద్రంలో గురువారం ఆయన ఉద్యాన కళాశాలను ప్రారంభించారు. అనంతరం ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. రైతులు ఆర్థికంగా నష్టపోకూడదని వచ్చే 10 రోజుల్లో అన్ని పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు చెప్పారు. అయితే మంత్రి తుమ్మల ప్రసంగానికి ముందే ఇతర జిల్లాల రైతులు వెళ్లిపోయారు.