హైదరాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ): రైతు భరోసా నిధులు జమకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉండి.. బ్యాంకు అంకౌట్లలో డబ్బులు పడని రైతులు స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సూచించారు. మరోవైపు.. రాష్ట్రంలో కొత్తగా భూముల యాజమాన్యం పొందిన రైతులకు కూడా రైతు భరోసాకు అర్హులవుతారని ప్రభుత్వం తెలిపిన విషయం విధితమే. జూన్ 5వ తేదీ వరకు భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పరిగణిస్తుంది.
ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన జూన్ 20వ తేదీ వరకు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవాలని భావించిన వారు సంబంధిత ఏఈవో దగ్గరకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుందనీ తెలిపారు.. జూన్ 20వ తేదీ వరకు అలా అప్లయ్ చేసుకున్న వారికి మాత్రమే రైతు భరోసా సాయం అందుతుందని అధికారులు తెలిపారు.