నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు వరుసగా ఈ నెల 3వ తేదీన సెలవును (Holiday )ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు సెలవు పాటించాలని ఆయన సూచించారు.
భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో విద్యా సంస్థలకు మంగళవారం సైతం సెలవు ప్రకటించామని కలెక్టర్ తెలిపారు. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.