Haryana Elections : హరియాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు సాగుతున్నదని పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ మోహన్ లాల్ బదోలి వెల్లడించారు. పార్టీలో అన్ని స్ధాయిల నుంచి అభ్యర్ధుల ఎంపికపై సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. వివిధ దశల్లో వడపోత, చర్చలు, సంప్రదింపుల అనంతరం పార్టీ కేంద్ర నాయకత్వం అభ్యర్ధుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
ఇక జేజేపీ నేతలు దేవేందర్ సింగ్ బాబిల్, సునీల్ సంగ్వాన్, సంజయ్ కబ్లానా తదితర నేతలు సోమవారం బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన నేతలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, హరియాణ బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బదోలి స్వాగతించారు. దేవేందర్ బబిల్ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా, టికెట్ ఇచ్చేందుకని పార్టీ ఎవరినీ చేర్చుకోదని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అంతకుముందు దేవేందర్ సింగ్ బబిల్ అన్నారు. హరియాణలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 55 మంది అభ్యర్ధులను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటికే ఖరారు చేసింది. అక్టోబర్ 5న హరియాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే దశలో నిర్వహించనున్నారు. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Khammam Floods | ఖమ్మం జన జీవనంపై జలఖడ్గం.. ఫోటోలు