హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాల బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ ఈనెల 25 వరకు పొడిగించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రూ.151కే రాములోరి కల్యాణ తలంబ్రాలు పొందవచ్చని, సంస్థ లాజిస్టిక్స్ విభాగం వెబ్సైట్ tsrtclogistics.in ద్వారా బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆఫ్లైన్లో పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ సెంటర్ ఫోన్ నంబర్లలో (040-23450033, 040-69440000, 040-69440069) సంప్రదించాలని సూచించారు.