Rains | రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతులం అవుతున్నది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ వరద నీటితో చెరువుల్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నెక్కొండ మండలం వెంకటాపురం వద్ద తోపనపల్లి చెరువు ఒక్కసారి పొంగడంతో వరద నీటిలో ఓ ఆర్టీసీ బస్సు చిక్కకుపోయింది.
శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో వేములవాడ నుంచి మహబూబాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎటు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో రాత్రంతా బస్సులోనే ఉండిపోయారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. బస్సులో చిన్న పిల్లలు కూడా ఉన్నారని.. అందరూ ఇబ్బంది పడుతున్నారు. తమను రక్షించాలని బంధువులు, అధికారులకు ఓ వీడియో రూపంలో సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంకటాపురం గ్రామానికి చేరుకున్నారు. ట్రాక్టర్ సహాయంతో ప్రయాణికులను రక్షించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు తరలించారు. వర్షం తగ్గిన తర్వాత వారిని గమ్య స్థానాలకు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు.
వాగు మధ్యలో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు.. కాపాడమని వేడుకుంటున్న ప్రయాణికులు
మహబూబాబాద్ – నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామ చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాగు వరదలో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు.
రాత్రి నుంచి ఇక్కడే ఉన్నామని.. తమను కాపాడాలంటూ బంధువులను, అధికారులను వేడుకుంటున్న… pic.twitter.com/mFnpoVFSH6
— Telugu Scribe (@TeluguScribe) September 1, 2024