హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సోమవారం, మంగళవారాల్లో ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో నిర్వహించను న్నారు. మొదటిరోజు 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (అగ్రికల్చర్) పోస్టులకు, రెండోరోజు మంగళవారం 97 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (మెకానికల్) ఉద్యోగాలకు పరీక్ష జరుగనున్నది.
రాష్ట్రంలోని వివిధ క్యాటగిరీల్లో 1,540 ఏఈఈ ఉద్యోగాల భర్తీకి గత సంవత్సరం సెప్టెంబర్ 3న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించింది. ముందుగా ఏఈఈ పరీక్షను ఈ ఏడాది జనవరి 22న నిర్వహించారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటపడిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఏఈఈ పరీక్షను రద్దు చేసింది. మళ్లీ కొత్త తేదీలను ప్రకటించింది. ఆన్లైన్లో నాలు గు దఫాలుగా పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.