TSPSC | ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్ నెలలో జరగాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను శనివారం సాయంత్రం విడుదల చేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారం.. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను ఈ నెల 4, 5, 6, 8వ తేదీల్లో టీఎస్పీఎస్సీ నిర్వహించనుంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి ఈ నెల 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 12, 13, 14, 20, 21, 22, 25, 26, 27,29వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.