ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌నీల్ సమర్పణలో రూపొందుతున్న హారర్ చిత్రం ‘418’. కీర్తన్ నాదగౌడ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. సూర్యరాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ముఖ్య పాత్రధారులు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ ఇదని, ఓ భయానక ప్రపంచం తాలూకు రహస్యాలను ఆవిష్కరిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ దివాకర్, సంగీతం: వెంకీ జీజీ, రచన-దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ.