ఉదయభాను నిర్మాతగా, షో రన్నర్‌గా వ్యవహరిస్తున్న వెబ్‌సిరీస్ ‘పంచనామా’. భరత్శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేటి నుంచి జీ5లో స్ట్రీమింగ్కానుంది. ఆరు ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత ఉదయభాను మాట్లాడుతూ..నిర్మాతగా మారాలన్నది తన 15ఏళ్ల కల అని, దానికోసం ఒక తపస్సు చేశానని, తక్కువ సమయంలో క్వాలిటీతో సిరీస్‌ను పూర్తి చేశామని చెప్పింది.
నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించే సిరీస్ ఇదని దర్శకుడు మోహన్‌శ్రీవత్స పేర్కొన్నారు. నటుడిగా తన 24 ఏళ్ల కెరీర్లో అతి తక్కువ టైంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఇదని, ఆద్యంతం థ్రిల్‌ని పంచుతుందని సిరీస్ హీరో, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.