BHOGI Teaser | రఫ్ లుక్‌లో శర్వానంద్.. అదిరిపోయే యాక్షన్‌తో ‘భోగి’ టీజర్
BHOGI Teaser | యువ కథానాయకుడు శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’ పై ఆసక్తి పెరుగుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. పచ్చి పల్లెటూరి వాతావరణం, రక్తపాతం, తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలతో టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.1960ల కాలం నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కథ సాగనున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది.
BHOGI Teaser | యువ కథానాయకుడు శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’ పై ఆసక్తి పెరుగుతోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. పచ్చి పల్లెటూరి వాతావరణం, రక్తపాతం, తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలతో టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.1960ల కాలం నేపథ్యంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కథ సాగనున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. అప్పటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న భూస్వామ్య వ్యవస్థ, అణచివేత, హింస, సామాన్య ప్రజల కష్టాలను కథలో ప్రధానంగా చూపించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ కమ్మరి గంగ అనే పాత్రలో కనిపించనున్నారు. వృత్తిరీత్యా కమ్మరిగా జీవించే గంగ.. తన గ్రామాన్ని గుప్పిట్లో పెట్టుకున్న శక్తివంతమైన వ్యక్తులకు ఎదురు తిరిగే పరిస్థితుల్లోకి వెళ్తాడు. టీజర్లో శర్వానంద్ పూర్తిగా రఫ్ లుక్‌లో కనిపిస్తూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పే సంభాషణలు పాత్రలోని తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి.
గ్రామస్తుల కష్టాలు, శారీరక శ్రమ, పోలీసులతో ఘర్షణలు, అణచివేతకు వ్యతిరేకంగా గంగ చేసే పోరాటం వంటి అంశాలను టీజర్లో చూపించారు. పల్లెటూరి నేపథ్యం, జానపద అంశాలు, మట్టి వాసనను ప్రతిబింబించే దృశ్యాలతో పాటు రక్తపాతంతో కూడిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేకమైన వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. గంగ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, అతడి పోరాటం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే ఆసక్తిని టీజర్ కలిగిస్తోంది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. టీజర్లో కనిపించిన గ్రామీణ నేపథ్యం, శర్వానంద్ రఫ్ అవతారం, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ‘భోగి’ చిత్రం నవంబర్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుంది. శర్వానంద్‌ను ఇంతకుముందెన్నడూ చూడని రీతిలో చూపిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajith | అజిత్‌కు గుడి కడతామంటూ అభిమానుల ప్రకటన.. విగ్రహానికి క్షీరాభిషేకం
Health tips | నోటి పుండ్లు మిమ్మల్ని వేధిస్తున్నాయా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
Job Fraud | ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళ నుంచి రూ.4.50 లక్షలు వసూలు.. ఆపై రిసార్ట్‌కు తీసుకెళ్లి అత్యాచారం
Car Race: బ్రిటన్‌లో కారు రేస్.. ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు 28 ఏళ్ల జైలుశిక్ష
Nani | ‘బ్లడీ రోమియో’లో బాలీవుడ్ నటుడు.. కీలక పాత్రలో కనిపించనున్న ‘ధురంధర్’ ఫేమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

