బానోత్ పవన్, గౌతమ్, నర్మద, సతీశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘ఐ బొమ్మ’. విజయ్ రఘునాథభట్ల దర్శకుడు. కురువ జమన్న నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన నిర్మాతలు రామసత్యనారాయణ, రాజా చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఆసక్తికరమైన కథతో ఈ సినిమా రూపొందుతున్నదని నిర్మాత కురవ జమన్న తెలిపారు. జీవితంలో అనేక సంఘర్షణలకు లోనైన వ్యక్తి సమాజానికి వ్యతిరేకంగా ఎలా అడుగు వేశాడు? అతన్ని ఈ వ్యవస్థ ఎలా పట్టుకుంది? అతని ఆలోచన వెనుక ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే ‘ఐ బొమ్మ’ అని, ఒక్క రాత్రిలో స్క్రిప్ట్ పూర్తి చేసి, 15రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని, త్వరలోనే రిలీజ్కు తెస్తున్నామని దర్శకుడు విజయ్ రఘునాథభట్ల చెప్పారు. ఇంకా నటులు బానోతు పవన్, గౌతమ సతీశ్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ మరుకుర్తి, సంగీతం: హనుమ ప్రసాద్ యాళ్ల.