TS Weather | రాగల నాలుగు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది. సోమవారం నుంచి మంగళవారం వరకు ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వడగండ్లు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం పలుచోట్ల పొడివాతావరణం ఏర్పడే సూచనలున్నాయని, పలుప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడుతాయని చెప్పింది. బుధవారం నుంచి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. సోమవారం వికారాబాద్, హైదరాబాద్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది.