New Delhi | ఇంటికి లేటుగా వచ్చినందుకు తిట్టిన పేరెంట్స్.. 13 ఏళ్ల బాలిక ఆత్మహత్య
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ఇంటికి లేటుగా రావడంతో పేరెంట్స్ తిట్టినందుకు ఒక బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ఇంటికి లేటుగా రావడంతో పేరెంట్స్ తిట్టినందుకు ఒక బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఢిల్లీలోని షహ్దారా ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. బిహార్‌లోని మధుబని జిల్లాకు చెందిన ఒక బాలిక (13) తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని షహ్దారా ప్రాంతంలోని ఇంట్లో నివసిస్తోంది.
రాత్రి ఇంటికి లేటుగా వచ్చింది. దీంతో బాలికను కుటుంబ సభ్యులు తిట్టారు. మనస్థాపానికి గురైన బాలిక వేరే గదిలోకి వెళ్లి, చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత బాలిక సోదరి వెళ్లి చూడగా, అప్పటికే ఉరివేసుకుని కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను కిందికి దించి, వెంటనే దగ్గర్లోని డా.హెగ్గేవార్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు. బాలిక మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

