Uttam Kumar Reddy | నాకేం తెల్వదు.. రేవంత్‌రెడ్డి ఆదేశిస్తేనే నీళ్లు వదులుతం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి ఉత్తమ్ జవాబు
Uttam Kumar Reddy | ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కింద ఎండిపోతున్న పంటలకు నీటి విడుదల చేసే అంశం తమ చేతుల్లో లేదని సాక్షాత్తు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చిచెప్పారు.
Uttam Kumar Reddy | మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కింద ఎండిపోతున్న పంటలకు నీటి విడుదల చేసే అంశం తమ చేతుల్లో లేదని సాక్షాత్తు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే నడుచుకోవాల్సి వస్తుందని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇదే విషయాన్ని ఓ ఎమ్మెల్యేతో అనడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో జూరాల ప్రాజెక్టు అంశాన్ని డైవర్ట్ చేసేందుకు జిల్లా మంత్రులు శాయశక్తులా కృషిచేశారు. అయినా రైతాంగం పట్టువీడకుం డా ఆందోళనకు దిగడం.. బీఆర్ఎస్ మద్దతు తెలుపడంతో పరిస్థితి చేయిదాటిపోయింది.
చివరకు డైవర్షన్స్ బెడిసి కొట్టడంతో జూరాల నీటి విడుదల అంతా తామే చేసినట్టు.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వా న్ని ఒప్పించినట్టు బిల్డప్ ఇచ్చేందుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు నానా తం టాలు పడుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో పర్యటించిన కేటీఆర్ జూరాల ప్రాజెక్టు కింద ఎకరా ఎండినా సర్కార్‌ను వదిలి పెట్టేది లేదని ఇచ్చిన అల్టిమేటమ్ పెద్ద దుమారం లేపింది. ఆ తరువాత రైతుల వరుస ఆందోళనలు కాంగ్రెస్ పార్టీ కి పెద్ద షాక్ ఇచ్చాయి. తొలుత ఈ ఆందోళనలను కాంగ్రెస్ సర్కార్ పట్టనట్టు వ్యవహరించగా.. దీన్ని డైవర్షన్ చేసేందుకు జిల్లా మంత్రులు శాయశక్తులా కృషిచేశారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాత్రం.. ఒకసారి పంటలు వదులుకుంటే ఏమైతదని రైతులను చులకన చేసి మాట్లాడారు. మంత్రి జూపల్లి అయితే ఏకంగా జూరాల అయినా రైతాంగం మొక్కవోని ధైర్యంతో ఇటు గద్వాల అటు వనపర్తి జిల్లాల్లో ఆందోళనలు చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే సాగుపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కోరగా.. ‘మా చేతిలో ఏమీ లేదు.. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలి. ప్రాజెక్టులన్నీ ఆ య న చేతుల్లోనే ఉన్నాయి. నేనేమి చేయలేను’ అంటూ చేతులెత్తేశారు.
‘మీ ముఖ్యమంత్రే కదా? మీరే అడుగొచ్చు కదా?’ అని మంత్రి దాటవేయడంతో సదరు ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంతలోనే ఇద్దరు మంత్రులు మరికొందరు ఎమ్మెల్యేలు హుటాహుటిన సచివాలయానికి చేరుకొని సీఎంను కలిసి పరిస్థితి వివరించారు. దీంతో అప్పటికప్పుడు కర్ణాటక సీఎంను కలిసి నీటిని విడుదల చేయాలని లేఖ రాసుకొని బెంగళూరుకు బయలుదేరి వెళ్లిపోయారు.
నిమజ్జనానికి నీళ్లు కరువు
హుజూరాబాద్ పట్టణ సమీపంలోని కాకతీయ కెనాల్ చుక్క నీరు లేక వెలవెలబోతున్నది. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ట్యాంకర్ల ద్వారా కాలువలో నీటిని పోయిస్తున్నారు.
– హుజూరాబాద్ రూరల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

